అందుకే నేను సికింద్రాబాద్ లో ఓడిపోయాను: దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు
- ఓటు చోరీ వల్లే ఓడిపోయానన్న దానం నాగేందర్
- ప్రతి ఒక్కరూ తమ ఓటును కాపాడుకోవాలని సూచన
- హైడ్రాపై తన వైఖరి మారలేదన్న దానం నాగేందర్
ఓటు చోరీ వల్లే తాను సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఓడిపోయానని, లేదంటే గెలిచేవాడినని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ ఓటును కాపాడుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం గత కొద్దికాలంగా 'ఎస్ఐఆర్' (ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) అంటోందని, ఈ ప్రక్రియ తర్వాత ప్రజలు తమ ఓటు ఉందో లేదో చూసుకోవాలని హితవు పలికారు.
హైడ్రాపై దానం నాగేందర్
హైడ్రాపై దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తన వైఖరి మారలేదని స్పష్టం చేశారు. హైడ్రా కారణంగా పేదలకు నష్టం కలగకూడదనే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. పేదల జోలికి వెళ్లకుండా హైడ్రా తన పని తాను చేస్తే స్వాగతిస్తానని అన్నారు. సీసీ కెమెరాలు భద్రత కోసం ఏర్పాటు చేస్తామని, కానీ వాటిని ట్యాపింగ్‌గా అభివర్ణించడం సరికాదని అన్నారు. ఇచ్చిన హామీలను కాస్త ఆలస్యమైనా తప్పకుండా నెరవేరుస్తామని అన్నారు.